RCB థ్రిల్లర్‌లో విజయం, టాప్‌లోకి; ముంబయి ఎలిమినేట్
రాయ్‌పుర్: ముంబయి ఇండియన్స్‌తో చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ 7 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా, ముంబయి ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.
ముంబయి నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కృనాల్ పాండ్య (73) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు అవసరం కాగా, మూడో బంతికి షెఫర్డ్ క్యాచ్ ఔటయ్యాడు. నాలుగో బంతికి భువనేశ్వర్ కుమార్ సిక్స్ కొట్టడంతో సమీకరణం చివరి బంతికి రెండు పరుగులుగా మారింది. రసిఖ్ సలామ్ కొట్టిన బంతికి రెండు పరుగులు పూర్తి చేయడంతో ఆర్సీబీ విజయం సాధించింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబయి 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు మాత్రమే చేయగలిగింది. తిలక్ వర్మ (57) మరియు నమన్ ధీర్ (47) రాణించారు. ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లతో అదరగొట్టాడు. అతను ఇన్నింగ్స్ మూడో ఓవర్లో వరుస బంతుల్లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వికెట్లు తీసి ముంబయిని కోలుకోలేని దెబ్బ తీశాడు. తన స్పెల్ చివరి బంతికి తిలక్ వర్మను కూడా ఔట్ చేశాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
డిజిటల్ ప్రకటనల కోసం సంప్రదించండి: 040 - 23318181, ఇమెయిల్: marketing@eenadu.in
© 1999 - 2026 ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, అన్ని హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి.
ఈనాడు.నెట్ కంటెంట్ కాపీరైట్ చేయబడింది. ఈ వెబ్‌సైట్ DNPA కోడ్ ఆఫ్ ఎథిక్స్ ను అనుసరిస్తుంది.