Trisha: రజనీ-కమల్ సినిమాలో త్రిష?
తమిళ సూపర్‌స్టార్లతో త్రిష కలయిక?
తమిళనాడులో ఎన్నికల సందడి మొదలైంది. గత కొన్ని రోజులుగా త్రిష పేరు మార్మోగిపోతోంది. ముఖ్యమంత్రిగా తమిళ సూపర్‌స్టార్ విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలోనూ త్రిష ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తమిళనాడు రాజకీయాల్లోకి ఆమె కూడా ప్రవేశిస్తారన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో మొదలైంది. అయితే ఆమె వరుస సినిమాలతో సందడి చేయబోతోంది. మరోవైపు కొత్త ప్రాజెక్టుల విషయంలోనూ ఆమె పేరు బలంగా వినిపిస్తోంది.
రజనీకాంత్, కమల్‌హాసన్ కలిసి చేయనున్న సినిమాలోనూ త్రిష కథానాయికగా నటించనున్నట్టు సమాచారం. నాలుగున్నర దశాబ్దాల తర్వాత రజనీకాంత్, కమల్‌హాసన్ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ సినిమాలోనే త్రిష ఓ కథానాయికగా నటించనున్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే ఈ కలయిక మరింత ప్రత్యేకం కానుంది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన అనంతరం ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ని పంచుకున్నారు త్రిష. ప్రేమ ఎప్పుడూ గట్టిగానే వినిపిస్తుంది... అనే వ్యాఖ్యని జోడిస్తూ, తన ముస్తాబు వెనకున్న తన బృందానికి కృతజ్ఞతలు చెప్పింది.